తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నీటమునిగిన పంట... ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం - రైతు ఆత్మహత్యాయత్నం వార్తలు

ఆరుగాలం పండించిన పంట నీటి మునిగిపోవడంతో... ఆవేదనను తట్టుకోలేకపోయిన రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పురుగులమందు తాగేందుకు యత్నించగా... అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. ఈ ఘటన పాలకీడు మండలంలో చోటు చేసుకుంది.

farmer-suicide-attempt-at-palakeedu-mandal-in-suryapet-district
నీటమునిగిన పంట... ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 16, 2020, 12:01 PM IST

సూర్యాపేట జిల్లాలోని పాలకీడు మండలంలోకి పులిచింతల నుంచి వరద నీరు భారీగా వచ్చింది. సుమారు 100 ఎకరాల పంట నీట మునిగిపోయింది. ఆరుగాలం పండించిన పంట... చేతికొచ్చే సమయానికి నీటి పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతులు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా... అక్కడున్న వారు అడ్డుకున్నారు. తమను ప్రభుత్వమే కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు.

నీటమునిగిన పంట... ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details