పాము కాటుతో అన్నదాత మృతి - కొమరారంలో రైతు మృతి
పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన... భద్రాద్రి కొత్తగూడడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారంలో చోటుచేసుకుంది. ఇంట్లో సామానులు తీస్తుండగా పాము కాటు వేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
పాము కాటుతో అన్నదాత మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారానికి చెందిన రైతు నౌశ్యా (50) పాము కాటుకు గురయ్యాడు. కోమరారం ప్రాథమిక వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించినప్పటికీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా... ఇల్లందుకు తరలించారు. వైద్యుల సూచన మేరకు ఖమ్మం తీసుకువెళ్తుండగా... మరణించాడు. వ్యవసాయ పనుల కోసం... ఇంట్లోని సామానులు తీస్తుండగా ఘటన జరిగినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.