తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అకాల వర్షాలతో నేలకొరిగిన పంట.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య

సాగు చేసిన పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చేతికొచ్చిన పంటను చూసుకుని మురిసిపోయాడు. కానీ చిరునవ్వు ఆ రైతు ముఖంపై ఎంతో కాలం నిలువలేదు. అకాల వర్షం.. అతని ఆశలను అడియాశలు చేసింది. పంటను నేలపాలు చేసింది. తట్టుకోలేని రైతు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు.

farmer-commits-suicide-at-polavaram
అకాల వర్షాలతో నేలకొరిగిన పంట

By

Published : Oct 27, 2020, 8:40 PM IST

Updated : Oct 27, 2020, 8:50 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలవరంలో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షాలకు పంట దెబ్బతినడం వల్ల మనస్తాపానికి గురై దారావత్​ రాందాస్​ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గ్రామానికి చెందిన దారావత్ రాందాస్ తనకున్న 9 ఎకరాల పొలంలో 6 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలతో పంటంతా నేలకొరిగింది. దెబ్బతిన్న పంటలను చూసి మనస్తాపం చెందిన రాందాస్.. ఇంటికి వెళ్లొస్తానని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

గుర్తించిన కుటుంబ సభ్యులు రాందాస్​ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది.​ మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇదీ చూడండి.. మానసిక ఒత్తిడితో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

Last Updated : Oct 27, 2020, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details