పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం పేరుతో తన భూమినంతా లాక్కున్నారంటూ.... నల్గొండ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. అనుముల మండలం వీర్లగడ్డతండాకు రమావత్ మురళి.... అదే గ్రామంలో తన రెండున్నర ఎకరాల పొలాన్ని సాగుచేసుకుంటున్నాడు. ఇటీవల గ్రామపంచాయతీ తీర్మానం చేసి.. వైకుంఠధామానికి ఎకరన్నర పొలం తీసుకున్నారని వాపోయాడు. మళ్లీ పల్లె ప్రకృతి వనం పేరుతో మిగతా భూమిని సైతం తీసుకునేందుకు అధికారులు పొలానికి వచ్చారన్నారని వాపోయాడు.
భూమిని లాక్కొంటున్నారంటూ రైతు ఆత్మహత్యాయత్నం - telangana crime news
ప్రభుత్వ కార్యక్రమాల కోసం అధికారులు తన భూమిని లాక్కొంటున్నారంటూ ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పురుగుల మందు తాగాడు. అయితే సర్కారు భూమినే సాగుచేసుకుంటున్నారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
భూమిని లాక్కొంటున్నారంటూ రైతు ఆత్మహత్యాయత్నం
పురుగులమందు తాగిన రైతుని సాగర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ భూమిని గ్రామంలో కొందరు సాగుచేసుకుంటున్నారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఇవీచూడండి:వైద్యానికి డబ్బులు లేక.. చేనేత కార్మికుడు బలవన్మరణం