ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అరవింద్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓలెక్స్లో ప్రకటన చూసి మోసపోయిన పలువురు నిరుద్యోగులు... అజిత్సింగ్ నగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు.
నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ టోకరా.. నిరుద్యోగుల డబ్బులతో పరార్ - విజయవాడలో నకిలీ సాఫ్ట్ వేర్
ఆంధ్రప్రదేేశ్లోని విజయవాడలో నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు... అరవింద్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై అజిత్సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ టోకరా.. నిరుద్యోగుల డబ్బులతో పరార్
ఒక్కొక్కరి నుంచి 10 వేల రూపాయిలు వసూలు చేసి.. కంపెనీ నిర్వాహకుడు పరారయ్యాడని బాధితులు ఆరోపించారు. ఇప్పటివరకు సుమారు ముప్పై మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో ఇలా మోసపోవటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
ఇదీ చదవండి:'నాకు అన్యాయం జరిగింది... నేను చచ్చిపోతా'