మైనర్ బాలిక వ్యవహారశైలిని తెలుసుకోవడానికి మహేశ్ అనే యువకుడు ప్రైవేట్ గూఢచార సంస్థతో చేతులు కలిపి రూ.17వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. హైదరాబాద్ చైతన్యపురి సమీపంలోని ఓ కాలనీలో నివాసముంటున్న మహేశ్‌కు మైనర్ బాలికను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. బాలిక మైనర్ అయినందున పెళ్లిని కొంతకాలం వాయిదా వేసుకున్నారు కుటుంబ సభ్యులు. బాలికపై ఇష్టం పెంచుకున్న మహేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా బాలిక ఫోన్ నెంబర్ సంపాదించాడు. అమ్మాయి క్యారెక్టర్ తెలుసుకోడానికి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిఘా పెట్టాడు.
మైనర్ అమ్మాయిపై నిఘా... ముగ్గురు అరెస్ట్ - undefined
మైనర్ బాలిక వ్యవహారశైలి తెలుసుకోవడానికి ప్రైవేట్ గూఢచార సంస్థతో చేతులు కలిపిన వ్యక్తితో పాటు సంస్థ నిర్వాహకులను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్
బహిరంగంగానే వివరాల సేకరణ..
బాలిక చదివే కళాశాల ప్రాంగణంలో బహిరంగంగానే బాలిక వివరాలు సేకరించడం గమనించిన ప్రిన్సిపల్ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కొందరు వ్యక్తులు తన కూతురిపై నిఘా పెట్టారని పోలీసులను ఆశ్రయించాడు ఆ తండ్రి. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నకిలీ డిటెక్టివ్ సంస్థలను నమ్మవద్దని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ విజ్ఞప్తి చేశారు. మహిళలు, బాలికలపై ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి:ఉప్పల్‌లో 13 లక్షల విలువైన గుట్కా పట్టివేత
Last Updated : Apr 3, 2019, 8:45 PM IST