హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన సైబర్ చీటర్స్ లక్ష రూపాయలు మోసం చేశారు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని వెంటనే లక్ష రూపాయలు తాను పంపిన అకౌంట్‌లో వేయాలని... అతని స్నేహితుడైన ఆర్మీ జవాన్ రాములుకి సైబర్ నేరగాడు మెసేజ్ పెట్టారు. వెంటనే ఆ అకౌంట్‌కు లక్ష రూపాయలను ఆర్మీ జవాన్ పంపించాడు. డబ్బులు అకౌంట్‌లో వేశానని స్నేహితుడికి జవాన్ కాల్ చేశాడు.
ఫేస్‌బుక్ హ్యాక్ చేసి లక్ష రూపాయలు దోచేసిన కేటుగాళ్లు - హైదరాబాద్ లో ఫేస్‌బుక్ హ్యాక్
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. రూటు మార్చి బురిడి కొట్టి దొరికిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్ హ్యాక్ చేసి... లక్ష రూపాయలు దండుకున్నారు. డబ్బులు ముట్టాయా అని ఫోన్ రావడంతో అసలు విషయం బయటపడింది.
facebook
తాను డబ్బులు అడగలేదని... ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించిన జవాన్, అతని స్నేహితుడు... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్