కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం పోలీసులు బాంబ్ స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు రెండు కిలోల వరకు నిషేధిత పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జంగంపల్లి గ్రామంలో పేలుడు సామాగ్రి స్వాధీనం - kamareddy district latest crime news
భిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో రెండు కిలోల నిషేధిత పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి గ్రామంలోని ఓ ఇంట్లో నాటుబాంబు పేలింది. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
జంగంపల్లి గ్రామంలో పేలుడు సామాగ్రి స్వాధీనం
శుక్రవారం రాత్రి నాటుబాంబు పేలిన ఘటనలో పుల్లూరి సిద్ధరాములు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సిద్ధరాములును అదుపులోకి తీసుకుని.. ఇంట్లో సోదాలు నిర్వహించారు.