తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎక్సైజ్ మెరుపు దాడి.. 102కిలోల గంజాయి స్వాధీనం - telangana news

జహీరాబాద్​లోని గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న ఓ ఇంట్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.3లక్షల విలువైన 102కిలోల గంజాయితోపాటు రవాణాకు ఉపయోగిస్తున్న కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Excise raids at zaheerabad and 102 kg of ganja seized
ఎక్సైజ్ మెరుపు దాడి.. 102కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Jan 3, 2021, 12:35 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో అక్రమంగా నిల్వ చేసిన రూ.3లక్షల విలువైన 102కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నారాయణఖేడ్​కు చెందిన నలుగురు వ్యక్తులు జహీరాబాద్​లోని హమాలి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని.. గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి బృందం మెరుపు దాడులు చేసింది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి పొట్లాల బస్తాలతోపాటు రవాణాకు ఉపయోగిస్తున్న కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి

ABOUT THE AUTHOR

...view details