ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు చేసిన చోరీలో పోలీసులు భాగమయ్యారు. దోచుకున్న సొమ్ములో వాటా తీసుకుంటున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కొత్తగా వచ్చిన శిక్షణ ఐపీఎస్ ప్రతాప్ శివకిషోర్.... దొంగలకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు... వారి ఫోన్ డేటాను తనిఖీ చేశారు.
దొంగలతో పోలీసుల డీల్... దోచుకున్న సొమ్ములో వాటా - polices shares stolen money in emmiganur
ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొందరు పోలీసులు సరికొత్త అవతారమెత్తారు. డబ్బుల కోసం దొంగలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. చోరీలకు పాల్పడి దోచుకున్న సొమ్ములో వాటాలు తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఈ అవినీతి తతంగం ఉన్నతాధికారుల విచారణలో బయటపడటంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.
police theft case
ఈ డేటాలో విస్తుపోయే అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. దొంగలు చోరీలకు పాల్పడి... దోచుకున్న సొమ్ములో పోలీసులు వాటా తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఫలితంగా ఒక ఎఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు.