తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కోటి రూపాయల డ్రగ్స్​ పట్టివేత - drugs

రాచకొండ పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కొకైన్​, హెరాయిన్​, కెమికల్​ పౌడర్​ స్వాధీనం చేసుకున్నారు.

కోటి రూపాయల డ్రగ్స్​ పట్టివేత

By

Published : Mar 13, 2019, 5:23 PM IST

మెట్రో నగరాలే లక్ష్యంగా
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున డ్రగ్స్​ సరఫరా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాలో ఐదుగురినిఅదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసేఒకటిన్నర కిలోలమాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.లోక్​సభ ఎన్నికల కోడ్ ఉన్నందునపోలీసులు కర్మన్ఘాట్​లో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ముఠా పట్టుబడింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్ళిన వారంతా గ్యాంగ్ గా ఏర్పడి ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరుకు చెందిన షేక్​ అబిద్​మాదక ద్రవ్యాలనుఓంకార్​, రాజశేఖర్​లతో కలిసి విశాఖపట్నం, హైదరాబాద్​, గోవాలలో విక్రయిస్తున్నారని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.

మెట్రో నగరాలే లక్ష్యంగా...

నిందితులు డ్రగ్స్​ను విక్రయించేందుకు మెట్రో నగరాలనేలక్ష్యంగా చేసుకుంటున్నారని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల నుంచి 325 గ్రాముల కొకైన్, 575 గ్రాముల హెరాయిన్, 600గ్రాముల కెమికల్ పౌడర్తో పాటు ఓ కారును, ఆరు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.ప్రధాన సూత్రదారుల్ని కూడా త్వరలో పట్టుకుంటామనిరాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details