వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం తలెత్తింది. దోమ మండలం గుముడాల గుప్తనిధులు ఉన్నాయంటూ ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపుతుండగా.. గ్రామస్థులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్థులు - గుప్త నిధుల కోసం వేట
రైతు పొలంలో అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్న ఘటన దోమ మండలం గుముడాల గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకరిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు.
తవ్వకాల్లో బంగారు వినాయకుని విగ్రహంతో పాటు మరికొన్ని నగలు బయటపడ్డాయని స్థానికులు అనుమానిస్తున్నారు. కోస్గి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన పిట్టల మల్లయ్యకు గుముడాల పరిధిలో భూములు ఉన్నాయి. ఆ పొలంలో గుప్తనిధులు ఉన్నాయని భావించిన రైతు.. హైదరాబాద్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి తవ్వకాలు చేపట్టారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. మిగతావాళ్లు పరారీలో ఉండగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:వీడియో వైరల్: పోటీలు పెట్టుకున్నారు.. ఆపై కొట్టుకున్నారు..!