రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని వరద నీటిలో మునిగిపోయిన ఉస్మాన్నగర్లో నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఉస్మాన్నగర్లో వరద నీటితో తేలుతున్న మృతదేహం గుర్తింపు - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
రంగారెడ్డి జిల్లా ఉస్మాన్నగర్లో వరదల వల్ల వచ్చి చేరిన నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు పడవ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు.
వరద నీటితో తేలుతున్న మృతదేహం గుర్తింపు
స్థానికుల సహాయంతో పడవ ద్వారా మృతదేహాన్ని బయటకు తీశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండిఃపోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం