హైదరాబాద్ బండ్లగూడలోని ఇంద్రప్రస్త కాలనీలో కిరణ్ అనే వ్యక్తి ఉంటున్నారు. ఇతను ఓ ప్రైవేట్ ఉద్యోగి. వీరి ఇంటి ఎదురుగా ఉండే వాళ్లతో కిరణ్‌కు గొడవ జరిగింది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న కిరణ్ ఎదురింటిలోని ఓ మహిళ చరవాణి, ఇతర వివరాలు సేకరించాడు.
పగ.. పన్నాగం.. డేటింగ్ వెబ్సైట్లో మహిళ వివరాలు - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
ఇంటి ఎదురుగా ఉండే కుటుంబంతో తలెత్తిన విభేదాల వల్ల కక్ష్య పెంచుకున్న ఓ వ్యక్తి.. ప్రతీకారం తీర్చుకునేందుకు నీచస్థితికి దిగజారాడు. ఆ కుటుంబంలోని మహిళ వివరాలను డేటింగ్ వెబ్సైట్లో ఉంచాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.
ప్రతీకారం: మహిళ వివరాలను డేటింగ్ వెబ్సైట్లో పెట్టిన నీచుడు
ఈ వివరాలను లొకాంటో డేటింగ్ వెబ్సైట్లో ఉంచాడు. దీంతో సదరు మహిళకు అసభ్య సందేశాలు వస్తుండటంతో మానసిక ఆందోళనకు గురైంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియటంతో వారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు... సాంకేతికత ఆధారంగా నిందితుడి గడ్డంపల్లి కిరణ్‌ను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:బీఆర్ఎస్‌పై ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వాలి : హైకోర్టు