రాష్ట్రంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీస్, ప్రభుత్వ అధికారులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. ఫేస్బుక్లో ఉన్న పోలీసు, ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్ ఫొటోలతో మోసాలకు పాల్పడుతున్నారు.
పోలీసు అధికారుల ఫొటోలతో సైబర్ నేరగాళ్ల మోసాలు - etv bharath
సైబర్ నేరగాళ్లు పోలీస్, ప్రభుత్వ అధికారులను కూడా వదలడం లేదు. ఫేస్బుక్లో పోలీసు, ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్ ఫొటోలతో మోసాలకు పాల్పడుతున్నారు.
cyber
వారి ఫొటోలతో నకిలీ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి వారి స్నేహితులకు.. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ సందేశం పంపుతున్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని... కొంతమంది బాధిత పోలీసులు హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఆ ముగ్గురి వల్లనే... బుల్లితెర నటి శ్రావణి కేసు ఛేదించిన పోలీసులు