తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రీఛార్జ్ చేసుకోమన్నారు.. డబ్బు కాజేశారు... - హైదరాబాద్​లో సైబర్ కేటుగాళ్లు

జియో కస్టమర్ కేర్​ నుంచి మెసేజ్​ చేస్తున్నట్లు అమాయకులను బురిడీ కొట్టించి వారినుంచి నగదు కాజేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్​లో ఇద్దరు మహిళల నుంచి రూ.2.7 లక్షల సొమ్ము కాజేశారు.

jio customer got cheated in Hyderabad
రీఛార్జ్ చేసుకోమన్నారు.. డబ్బు కాజేశారు...

By

Published : Dec 15, 2020, 9:21 AM IST

జియో కస్టమర్​ కేర్ పేరుతో కొత్త రకం మోసానికి తెరతీశారు సైబర్ నేరగాళ్లు. సిమ్ బ్లాక్ అవుతుందంటూ రిమోట్ యాక్సెస్​ యాప్​ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి జియో కస్టమర్​ ఖాతాలోని డబ్బును మాయం చేశారు.

ఇప్పటి వరకు ఇద్దరు మహిళల నుంచి రూ.2.7 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. జియో కస్టమర్లు సైబర్ మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details