తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సైబర్ నిందితున్ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు - హైదరాబాద్​ సైబర్ క్రైమ్

హైదరాబాద్​లో సైబర్ నేరానికి పాల్పడిన విశాఖపట్నం వాసిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. నగరానికి చెందిన ఓ వ్యాపారి మూడు బ్యాంకు ఖాతాల నుంచి 36 లక్షల రూపాయలను కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.

Cyber crime accused arrest by hyderabad CCS police
సైబర్ నిందితున్ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు

By

Published : Nov 2, 2020, 10:01 PM IST

హైదరాబాద్​లో ఓ వ్యాపారి బ్యాంకు ఖాతాల నుంచి 36 లక్షల రూపాయలు కాజేసిన సైబర్ నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో కోల్​కతాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేయగా, తాజాగా విశాఖపట్నం వాసి చిరంజీవిని అరెస్ట్ చేశారు. వ్యాపారికి చెందిన సిమ్ కార్డును స్వాపింగ్ చేసి నగదు లావాదేవీల వివరాలు చరవాణి, మెయిల్​కు సందేశం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

సెప్టెంబర్ నాలుగో తేదీ తన ఖాతాల్లో డబ్బులు పోయాయని గుర్తించిన వ్యాపారి వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు చిరంజీవి ఓ బ్యాంకు ఖాతాను తెరిచి సైబర్ నేరగాళ్లతో నగదును తన ఖాతాలోకి బదిలీ అయ్యేలా ఒప్పందం చేసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:శంషాబాద్​ విమానాశ్రయంలో 5.7 కేజీల ఎర్రచందనం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details