తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మహబూబాబాద్​లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్​ - మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి లక్ష రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వెల్లడించారు.

cricket betting gang arrested in mahabubabad district
మహబూబాబాద్​లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్​

By

Published : Oct 29, 2020, 9:52 PM IST

క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే 12 మంది ముఠా సభ్యులను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్​ చేశారు. మహబూబాబాద్ మండలం శనిగపురానికి చెందిన మందా సాయి, షేక్ పాషా, షేక్ మీరా, గుగులోత్ రమేశ్​, మహబూబాబాద్ పట్టణానికి చెందిన రాపోలు శ్రీనివాస్, నిమ్మరబోయిన వెంకటేశ్​, రేసు శ్రీధర్, కుక్కల సతీష్, మల్లం వంశీకృష్ణ , మరిపెడకు చెందిన ఉడుగుల రాజు, ఉప్పల సతీష్, సంగెం భరత్​ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.

జనగాం సాయి, మనోజ్ రెడ్డి పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి నుంచి లక్ష రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. క్రికెట్ అంటే అందరికీ అభిమానమేనని, ఒకవైపు పు యువత చరవాణిలో అతుక్కపోతూ... మరోవైపు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్నారన్నారు.

పట్టణాలకే పరిమితమైన ఈ బెట్టింగ్ సంస్కృతి నేడు గ్రామాలకు కూడా వ్యాపించిందన్నారు. నిమిషాల్లో లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయని... బెట్టింగ్ ఉచ్చుల్లో పడి యువత, చిరువ్యాపారులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. డబ్బులు దొరకని పరిస్థితుల్లో దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్​కు పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details