హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసే సుశీల్ సింగ్, అనిల్ సింగ్ జీతాలు సరిపోక బెట్టింగ్ దందాలోకి దిగినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 2 సెల్ఫోన్లతో పాటు రూ.22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి గోల్కొండ పోలీసులకు అప్పగించారు.
అలిజపూర్లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరు అరెస్ట్ - తెలంగాణ వార్తలు
క్రికెట్ బెట్టింగ్ దందాని నిర్వహిస్తున్న ఇద్దరిని వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 సెల్ఫోన్లతో పాటు రూ.22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్... నగదు స్వాధీనం
అలిజపూర్లోని ఓ ఇంటిని అడ్డాగా చేసుకొని బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగరంలోని సుమారు 15 మంది నుంచి ఈ డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:వికారాబాద్‌లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ