పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిల్హౌస్పేటకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకింది. వారిలో తల్లితండ్రులు, కుమార్తెను ఆశ్రం కొవిడ్ ఆసుపత్రిలో చేర్చారు. 24 ఏళ్ల కుమారుడికి కరోనా లక్షణాలు అంతగా లేకపోవడంతో హోంక్వారంటైన్లో ఉంచారు.
కుటుంబమంతటికీ కరోనా.. కుంగుబాటుతో యువకుడి ఆత్మహత్య - west godavari corona news
హోంక్వారంటైన్లో ఉన్న ఓ యువకుడు కుంగుబాటుకు గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిల్హౌస్పేటలో జరిగింది. మృతుడి కుటుంబమంతా.. కొవిడ్ ఆసుపత్రిలో ఉన్నారు.
suicide
కొన్నాళ్లుగా ఒంటరిగా ఉండటంతో అతడు కుంగుబాటుకు గురై, బుధవారం ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ చదవండి :అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...