కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పత్తి వ్యాపారం చేసే విశ్వనాధుల వెంకటేశ్వర్లు(60) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు గత కొన్నేళ్లుగా పత్తి మార్కెట్ సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకొని వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయన్న మనస్తాపంతో... - jammikunta news
అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయన్న మనస్తాపంతో ఓ పత్తి వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది.
cotton bussiness man suicide in jammikunta
అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడం వల్ల మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.