మెదక్ జిల్లా శివంపేటకు చెందిన పిట్ల రాములు (72) ఓ విశ్రాంత ఉద్యోగి. ఇటీవలె అస్వస్థతకు గురై హైదరాబాద్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఇదే క్రమంలో అతనికి కరోనా సోకింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి మందులు వాడుతున్నాడు. కాగా గ్రామస్థులందరూ కలిసి వారిని గ్రామంలో ఉండొద్దని.. చికిత్స చేయించుకోవాలని పట్టుబట్టారు. అప్పటికే తమ ఇంటికి వెళ్లే దారుల్లో ముళ్ల కంప వేశారని.. తమను మానసిక వేదనకు గురి చేశారని బాధితుడి భార్య సుశీల తెలిపారు. అయితే గ్రామస్థుల పోరు భరించలేక 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. అదే రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు.
మానవత్వం మంటకలిసే.. కరోనా బాధితుడు లోకాన్ని విడిచే - స్థానికుల వేధింపులతో కరోనా రోగి మృతి
కరోనా వచ్చి.. మనుషుల్లోని మానవత్వాన్ని మంట కలిపేస్తోంది. వ్యాధిగ్రస్తులను ఆదరించాల్సింది పోయి సమాజంలో వారిని చిన్న చూపు చూసి చీదరిస్తున్నారు. దీనితో వారు ఓ పక్క వ్యాధిని మనోధైర్యంతో ఎదిరిస్తున్నా చుట్టుపక్కల వారి మాటలను తాళలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేటలో కరోనా బారినపడిన ఓ విశ్రాంత ఉద్యోగికి జరిగిన ఘటన హృదయాలను కలచివేస్తోంది.
మానవత్వం మంటకలిసే.. కరోనా బాధితుడు లోకాన్ని విడిచే
మృతదేహాన్ని సైతం గ్రామానికి తీసుకురావద్దని చెప్పారు. ఏం చేయాలో తోచని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఫిలింనగర్ సమీపంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మార్పు రావడం లేదని.. తనను ఆసుపత్రికి తీసుకువెళ్లొద్దని చివరి క్షణం వరకూ మృతుడు వేడుకున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్