తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

శానిటైజర్​ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా - ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు

ఏపీలోని కురిచేడులో శానిటైజర్ తాగి 10మంది మృతి చెందిన ఘటనలో.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కు తరలించారు. మృతదేహాలకు కరోనా ర్యాపిడ్ టెస్ట్​లు నిర్వహించారు. వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

kurichedu
శానిటైజర్​ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా

By

Published : Aug 1, 2020, 8:00 AM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది మృతి చెందిన ఘటనలో.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కు తరలించారు. అక్కడ మృతదేహాలకు కరోనా ర్యాపిడ్ టెస్ట్​లు నిర్వహించగా.. మృతుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

ప్రకాశం జిల్లాలో మద్యం మహమ్మారికి 13 మంది బలి అయ్యారు. మద్యానికి బానిసై మందు దొరక్క వ్యసనపరులు శానిటైజర్ తాగారు. రెండు వేర్వేరుచోట్ల జరిగిన ఘటనల్లో 13 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లా కురిచేడులో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. పామూరులో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది మృత్యవాతపడ్డారు. మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి చనిపోయినట్లు స్థానికులు వెల్లడించారు.

ఇదీ చదవండి:ప్రాణాలు తీసిన శానిటైజర్.. విషాదంలో 13 కుటుంబాలు

ABOUT THE AUTHOR

...view details