మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సూర్యనారాయణ ఉపాధి కోసం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి జీడిమెట్లలో ఉంటున్నాడు.
విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి - తెలంగాణ వార్తలు
విద్యుదాఘాతంతో భవన కార్మికుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు సూర్యనారాయణ మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి
రోజుమాదిరిగానే ఆదర్శనగర్‌లో భవన నిర్మాణ పనికి వెళ్లాడు. గోవా కట్టెలు కడుతుండగా ప్రమాదవశాత్తు పక్కనున్న విద్యుత్‌తీగలు తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండిఃకత్తులతో దాడిచేసి యువకుడి దారుణ హత్య