సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయం వద్ద సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న మధు.. తన తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. మృతుడు కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం బత్తులపాలేనికి చెందిన మధు... బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయం వద్ద తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు.
తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
ఆదివారం ఉదయం విధులకు హాజరైన మధు ఏడుగంటల సమయంలో తుపాకీతో కాల్చుకున్నాడు. రక్తపు మడుగులో పడిఉన్న అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధు స్వస్థలం నేరేడుచర్ల బత్తుల పాలెం. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం
Last Updated : Nov 1, 2020, 12:03 PM IST