జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడులో క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక యువకులు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవెళ్లి మండలం పుల్లూరుకు చెందిన యువకులకు.. పెబ్బేరు మండలం కంచిరావుపల్లికి చెందిన యువకులకు మధ్య పోటీ నిర్వహించగా.. వారి మధ్యలో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో పోటీలు నిర్వహిస్తున్న చెన్నిపాడు యువకులు, పుల్లూరు యువకుల మధ్య తోపులాటతో ఘర్షణ మొదలైంది.
వీడియో వైరల్: పోటీలు పెట్టుకున్నారు.. ఆపై కొట్టుకున్నారు..! - జోగులాంబ జిల్లాలో వైరల్ అవుతున్న ఫైటింగ్ వీడియో వార్తలు
పండుగ కదా అని సరదాగా కబడ్డీ పోటీలు నిర్వహించుకున్నారు. ఆటలో మొదలైన చిన్నపాటి వివాదం.. ఇరు వర్గాల ఘర్షణకు దారితీసింది. కర్రలతో కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ వీడియోలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
వీడియో వైరల్: పోటీలు పెట్టుకున్నారు.. ఆపై కొట్టుకున్నారు..!
చెన్నిపాడుకు చెందిన యువకులు ఒక్కసారిగా పుల్లూరుకు చెందిన యువకులపై కర్రలతో దాడి చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం వల్ల ఇరు గ్రామాలకు చెందిన పెద్దలు రంగంలోకి దిగి.. యువకుల మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.
ఇదీ చూడండి: మినీ బస్సును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి