తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మా నాన్నను డాక్టర్లే చంపారు..!

కాలేయ సమస్యతో ఆస్పత్రికి వెళ్తే ప్రాణాలే పోయాయి. అధిక డోస్ మందులు ఇవ్వటం వల్లే చనిపోయారని మృతుని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

By

Published : Feb 7, 2019, 12:01 PM IST

Updated : Feb 7, 2019, 2:55 PM IST

వైద్యుల నిర్లక్ష్యమే కారణం
కరీంనగర్​ జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య కాలేయ సమస్యతో జనవరి 21న నిమ్స్​ ఆసుపత్రిలో చేరారు. బుధవారం సాయంత్రం తీవ్ర నొప్పి వస్తోందని వైద్యులకు చెప్పినా సకాలంలో స్పందించలేదు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని శ్రీకాంత్​ ఆరోపించాడు. మోతాదుకు మించిన మందులు ఇచ్చారని ఆరోపిస్తున్నాడు.
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మృతుని కొడుకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.
Last Updated : Feb 7, 2019, 2:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details