ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కాకుమాను మండలం జోడిపాలెం గ్రామానికి చెందిన మామిళ్లపల్లి దీప్తి హైదరాబాద్‌లో ఉంటుంది. నగరంలో పని చేస్తున్న ఓ రెవెన్యూ అధికారిని బదిలీ చేస్తానంటూ లక్షల్లో తీసుకుని మోసగించడం వల్ల ఆయన సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆమె మోసాలను గుర్తించారు.
ఉద్యోగాలు, బదిలీల పేరుతో మోసం చేస్తున్న మహిళ అరెస్టు
మనుషుల బలహీనతలను సొమ్ముచేసుకున్న ఓ కిలేడీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారి వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్నాన్నంటూ మాయమాటలు చెప్పి పలువురిని మోసగిస్తున్న మహిళను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు, మూడేళ్లుగా ఆమె ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు.
ఉద్యోగాలు, బదిలీల పేరుతో మోసం చేస్తున్న మహిళ అరెస్టు
అనంతపురంలోని కియా మోటార్స్‌లో కొలువు ఇప్పిస్తానంటూ ఓ యువకుడి నుంచి రెండు లక్షలు తీసుకుందని తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్తిపాటి దిలీప్, మోహన్ రావులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.6.50 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. వారు గత ఏడాది అక్టోబరులో ఏపీ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి ఆమెను అరెస్టు చేశారు.
ఇవీచూడండి:సినిమా కథను మించిన థ్రిల్లర్ స్టోరీ... నేపాల్ గ్యాంగ్ చోరీల మిస్టరీ