తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విశ్రాంత అదనపు ఎస్పీపై కేసు నమోదు

వారసత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకపన్న విశ్రాంత అదనపు ఎస్పీ కోతి సుదర్శన్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా మద్దిరాల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇతనితోపాటు అప్పటి తుంగతుర్తి తహసీల్దార్ డేవిడ్ రాజు, వీఆర్వో సైదులు, ప్రస్తుత మద్దిరాల తహసీల్దార్ రాంప్రసాద్ పై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరపుతున్నట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు.

http://10.10.50.85:6060/reg-lowres/27-October-2020/tg-nlg-62-26-x-sp-pai-kesu-namodu-av-ts10101_27102020202202_2710f_1603810322_858.mp4
విశ్రాంత అదనపు ఎస్పీపై కేసు నమోదు

By

Published : Oct 27, 2020, 11:49 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన కోతి సత్యనారాయణరెడ్డి, కోతి సుదర్శన్ రెడ్డి సోదరులు. వీరికి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 7.18 ఎకరాల భూమిని 2010లో విశ్రాంత అదనపు ఎస్పీ కోతి సుదర్శన్ రెడ్డి అప్పటి తహసీల్దార్ డేవిడ్ రాజుతో కుమ్మక్కై అక్రమంగా తన పేరున పట్టా చేయించుకున్నాడు.

సత్యనారాయణ రెడ్డి ఇటీవల భూమి పట్టా మార్పిడి వివరాలను సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ అధికారులను కోరారు. రెవెన్యూ దస్త్రాలు అందుబాటులో లేవని అధికారులు లిఖిత పూర్వకంగా వివరాలు అందించారు. ఈ విషయమై బాధితుడు తుంగతుర్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మద్దిరాల పోలీసులు విశ్రాంత అదనపు ఎస్పీ కోతి సుదర్శన్ రెడ్డి అప్పటి తుంగతుర్తి తహసీల్దార్ డేవిడ్ రాజు, వీఆర్వో సైదులు, ప్రస్తుత మద్దిరాల తహసీల్దార్ రాంప్రసాద్ పై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:పట్ట పగలే ఇంట్లో దూరి నగలు దోచుకెళ్లిన దొంగ...

ABOUT THE AUTHOR

...view details