గుంటూరు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ సోదాలు నిర్వహించింది. ఏపీలోని 25 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే ఇంట్లోనూ తనిఖీలు చేపట్టింది.
అక్రమ మైనింగ్ కేసు.. 25 చోట్ల సీబీఐ సోదాలు
ఏపీలోని గుంటూరు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా... ఏపీలో 25 చోట్ల సీబీఐ సోదాలు చేసింది. తెదేపా మాజీ ఎమ్మెల్యే ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
అక్రమ మైనింగ్ కేసు.. 25 చోట్ల సీబీఐ సోదాలు
అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలోనే ఏపీ హైకోర్టు ఆదేశించింది. వైకాపా ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ అప్పట్లో 17 మందిపై కేసు నమోదు చేసింది. కోనంకి, దాచేపల్లి, కేతనపల్లి, నడికుడిలో అక్రమ మైనింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దాచేపల్లి, పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను సీబీఐ పరిగణలోకి తీసుకుంది.
ఇవీచూడండి:హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్