తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సుప్రీంకోర్టు, హైకోర్టుపై పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసు - ఏపీ హైకోర్టుపై పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసు

cbi
cbi

By

Published : Nov 16, 2020, 5:06 PM IST

Updated : Nov 16, 2020, 6:21 PM IST

17:04 November 16

సుప్రీంకోర్టు, హైకోర్టుపై పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసు

సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో  పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన 16 మందిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసులు నమోదు చేసింది. మరో గుర్తు తెలియని వ్యక్తిపైనా ఎఫ్ఐఆర్​ నమోదు చేసింది.  

ఫేస్​బుక్, ట్విటర్ తదితర మాధ్యమాల్లో న్యాయమూర్తులకు విరుద్ధంగా పోస్టులు పెట్టినట్టుగా సీబీఐ గుర్తించింది. ఇప్పటికే సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన కేసులను యథాతథంగా తీసుకుంటున్నట్టుగా సీబీఐ పేర్కొంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 154, 153 ఏ, 504, 505 ల ప్రకారం సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్​లను కలుపుతూ ఒకే కేసుగా దర్యాప్తు చేయనున్నట్టు సీబీఐ స్పష్టం చేసింది. 

Last Updated : Nov 16, 2020, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details