మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు.
కారులో చెలరేగిన మంటలు... తప్పిన ప్రాణనష్టం - Car burnt in fire at bala nagar news
ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి.. చూస్తుండగానే కారు తగలబడిపోయింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మంటల్లో తగలబడిపోయిన కారు.. తప్పిన ప్రాణనష్టం
మహబూబ్నగర్ పట్టణానికి చెందిన శ్రీకాంత్ తన భార్య, పిల్లలతో కలిసి షాద్నగర్ వెళ్లారు. తిరిగి మహబూబ్నగర్ వస్తుండగా బాలానగర్ వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన శ్రీకాంత్ కుటుంబం వెంటనే కారు నుంచి కిందికి దిగారు. చూస్తుండగానే కారు తగలబడిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి.. పెళ్లి ఖర్చులకు డ్రా చేసిన డబ్బులు చోరీ.. దొంగ అరెస్ట్