తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డీసీఎంను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు - సూర్యాపేటలో బస్సు బోల్తా

ఎదురుగా వచ్చిన డీసీఎంను తప్పించేందుకు ప్రయత్నించగా... ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఘటన మోతెలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.

bus-accident-in-suryapet-district
డీసీఎంను తప్పించబోయి... రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు

By

Published : Aug 31, 2020, 12:02 PM IST

సూర్యాపేట జిల్లా మోతెలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హైదరాబాద్‌ నుంచి సత్తుపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు... మోతె మండలం వద్దకు చేరుకోగానే ఎదురుగా డీసీఎం వచ్చింది. దానిని తప్పించాలని డ్రైవర్ ప్రయత్నించటంతో బస్సు రోడ్డు పక్కకి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా... అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డీసీఎం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీ చూడండి:ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

ABOUT THE AUTHOR

...view details