తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బిస్కెట్లే ఆ చిన్నారుల పాలిట యమపాశాలా..? - childrens dead by biscuits news update

బిస్కెట్లు తినని పిల్లలుంటారా అంటే లేదనే చెప్పాలి. చిన్నారులు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్లే వారి పాలిట యమపాశాలైతే.. ఆ విషాదానికి అంతే ఉండదు. అలాంటి బిస్కెట్లు తిని అన్నా, చెల్లెల్లు మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

బిస్కెట్లే ఆ చిన్నారుల పాలిట యమపాశాలా..?
బిస్కెట్లే ఆ చిన్నారుల పాలిట యమపాశాలా..?

By

Published : Sep 14, 2020, 9:46 PM IST

బిస్కెట్లే ఆ చిన్నారుల పాలిట యమపాశాలా..?

ఆడుతూ.. ఆడుతూ బిస్కెట్లు కొసం వెళ్లిన ఆ చిన్నారులు.. అవే బిస్కెట్లు తిని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏం జరిగిందో తెలుసుకొనే లోపే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో ఆదివారం విషాదాన్ని పంచింది.

అసలేం జరిగింది..?

స్థానిక దుకాణంలో బిస్కెట్లు కొనుగోలు చేసి, తిన్న చిన్నారులు కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తల్లిదండ్రులు ఆళ్లగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఎనిమిదేళ్ల ఉసేన్​ బాషా ప్రాణాలు విడిచాడు. పరిస్థితి విషమించడంతో మరో ఇద్దరు చిన్నారులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మరో చిన్నారి నాలుగేళ్ల ఉసేన్​బీ మృతి చెందింది. చికిత్స పొందుతున్న మరో బాలిక జమాల్ బీ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి:

భార్యపై అనుమానం.. వివాహమైన నెలన్నరకే వరుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details