తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తండ్రి తాగుడు మానట్లేదని కొడుకు ఆత్మహత్య - nizamabad news

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పెడిమల్ దని తండాలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రి ప్రవర్తనలో మార్పు లేకపోవటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై 16 ఏళ్ల బాలుడు బలవన్మరణం చెందాడు.

boy suicided for his father behavior
boy suicided for his father behavior

By

Published : Aug 28, 2020, 10:40 AM IST

తండ్రి వైఖరికి విసిగి వేసారిపోయిన 16 ఏళ్ల బాలుడు ఊపిరి తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పెడిమల్ దని తండాకు చెందిన బాలుడి చిన్నతనంలోనే తల్లి దూరమైంది. తండ్రి వద్దే పెరుగుతూ చక్కటి భవిష్యత్తు నిర్మించుకోవాలని కలలు కన్నాడు. కానీ... తండ్రి మద్యానికి బానిస కావటం వల్ల పని చేసుకుంటూ చదువుకుంటున్నాడు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న బాలుడు.... తండ్రిని మద్యం మానేయాలని పలుమార్లు బతిలాడాడు.

ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని తాను చదువుకునే పరిస్థితి ఉండదని తండ్రికి వివరించాడు. అయినా తండ్రి ప్రవర్తనలో మార్పులేకపోవటం వల్ల కోపానికి గురయ్యాడు. విసిగివేసారిన ఆ బాలుడు గ్రామ శివారులోని పంటపొలాల్లోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details