బాలుడి మృతి
బాల్యమంటేనే ఆటలు. అవే పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి. నిన్న లిప్టులో ఆడుకుంటూ ఓ బాలుడు... నేడు సంపులో పడి మరో చిన్నోడు మృతి చెందాడు.
సంపులో పడి బాలుడి మృతి
మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో విషాదం చోటు చేసుకుంది. హిల్టాప్ కాలనీలో నివసించే సతీష్ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న స్టీఫెన్ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. బాలుడి కోసం వెతికిన తల్లికి విగతజీవిగా కనిపించాడు. రోజూ చలాకీగా తిరిగే కొడుకు ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.