మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల పురపాలికలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న రంగయ్య (32) రాజశేఖర్ (26) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సిగ్నల్ గడ్డ వద్ద ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఘటనలో రంగయ్య మృతి చెందగా.. రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి - జడ్చర్లలో రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ప్రమాదవశాత్తు కిందపడ్డ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జడ్చర్లలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి
క్షతగాత్రుడిని మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య