ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం నందిగామకు చెందిన గిరిజన రైతు లక్ష్మణ్ ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. రోజువారీ పనుల్లో భాగంగా ఈ రోజు ఉదయం పంట చేనుకు వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్‌ని స్థానికులు.. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
పంట చేలో రైతుపై ఎలుగుబంటి దాడి
ఎలుగుబంటి దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రైతు ముఖంపై, శరీరంపై తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
పంట చేలో రైతుపై ఎలుగుబంటి దాడి
ముఖం, శరీరంపై ఎలుగు తీవ్రంగా దాడి చేయడంతో రైతు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:అక్కాతమ్ముళ్ల మధ్య 'ఆస్తి' చిచ్చు...నలుగురికి తీవ్రగాయాలు