తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తుర్కపల్లి ఘటనపై భగ్గుమన్న స్థానికులు - TURKAPALLI

సికింద్రాబాద్ అల్వాల్‌ పరిధిలోని తుర్కపల్లి హత్య ఘటనలో స్థానికులు భగ్గుమన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ స్థానికులు, పాఠశాల విద్యార్థులు నిరసన చేపట్టారు.

తుర్కపల్లి ఘటనపై భగ్గుమన్న స్థానికులు, చిన్నారులు

By

Published : Mar 22, 2019, 12:44 PM IST

Updated : Mar 22, 2019, 2:12 PM IST

తుర్కపల్లి ఘటనపై భగ్గుమన్న స్థానికులు, చిన్నారులు
సికింద్రాబాద్ అల్వాల్‌ పరిధిలోని తుర్కపల్లిలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి చేసి అనంతరం గొంతుకోసి హత్య చేశారు దుండగులు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు బిహారీలను అదుపులోకి తీసుకున్నారు. పాప మృతితో తుర్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి చదివే పాఠశాల విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. పాప మృతికి నివాళిలు అర్పించి ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి మృగాళ్లకు మరణశిక్ష విధించాలని ఉపాధ్యాయులు డిమాండ్​ చేస్తున్నారు.

ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. ఇలాంటి ఘటనలతో పిల్లలను బయటకు పంపాలంటే భయంగా ఉందని వాపోయారు.

ఇప్పటికే విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు బిహారీలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పాప మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు గాంధీకి తరలించారు.

ఇవీ చూడండి:ఆరేళ్ల బాలికపై లైంగికదాడి... అనంతరం హత్య

Last Updated : Mar 22, 2019, 2:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details