తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అన్నదమ్ములు.. ఆటోలు మాయం చేస్తారు!

పగలంతా ఆటో నడిపి.. రాత్రికి ఆరుబయట నిలిపి.. ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తున్నారా.. వారి కన్ను పడితే మీ ఆటో మాయమైనట్లే. ఇలా 40కి పైగా ఆటోలు చోరీ చేసిన ఘరానా దొంగలను జీడిమెట్ల పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

అన్నదమ్ములు.. ఆటోలు మాయం చేస్తారు!
అన్నదమ్ములు.. ఆటోలు మాయం చేస్తారు!

By

Published : Feb 9, 2021, 9:23 AM IST

హైదరాబాద్​ బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తం వివరాల ప్రకారం... గురుమూర్తినగర్‌కు చెందిన హోటల్‌ కార్మికుడు మహ్మద్‌ ఫారుక్‌(27), గాంధీనగర్‌ నివాసి ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ జాఫర్‌(30) అన్నదమ్ములు. వీరు గతంలో 35 ఆటోలు, బైకులు చోరీ చేసి 2016లో జైలుకెళ్లి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఖాళీగా ఉంటూ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6 ఆటోలను దొంగిలించారు.

ఈనెల 4వ తేదీ రాత్రి జీడిమెట్ల ఇంద్రసింగ్‌నగర్‌లో ఎ.శ్రీనివాస్‌ ఆటోను దొంగిలించడంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈనెల 7న గాజులరామారం కూడలిలో ఫారుక్‌, జాఫర్‌ ఆటోలో ప్రయాణిస్తూ పోలీసుల కంటపడ్డారు. పత్రాలు లేకపోవడంతో ఠాణాకు తీసుకెళ్లి విచారించగా, చోరీల చిట్టా విప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బిలోలీ గ్రామ వాసి అస్లాం ఖురేషి(25)కి రెండు ఆటోలను విక్రయించినట్లు చెప్పగా, అస్లాంను అరెస్టు చేసి ఆ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

మరో రెండింటిని దూలపల్లి అడవిలో గుర్తించారు. లాక్‌డౌన్‌ సమయంలో పనిదొరక్క మళ్లీ ఈ బాట పట్టామని, ఒక్కో ఆటోను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు విక్రయించినట్లు చెప్పారు. ఆరు ఆటోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫారుక్‌, జాఫర్‌, అస్లాంలను సోమవారం రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details