మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో జరిగిన ఆటో ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని రజాల్‌పేటకు చెందిన కూలీలు మిర్చి తెంపడానికి ఆటోలో కొత్తూరు(సీ) గ్రామానికి బయలుదేరారు. మండల కేంద్రం సమీపంలో ఒక్కసారిగా రోడ్డుపై పంది అడ్డొచ్చింది. డ్రైవర్ దానిని తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న మిషన్ భగీరథ గేట్‌వాల్‌ను బలంగా ఢీకొట్టింది.
పందిని తప్పించబోయి ప్రమాదం: ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు
అకస్మాత్తుగా అడ్డు వచ్చిన పందిని తప్పించబోయి.. భగీరథ గేట్‌వాల్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కూలీ కోసం వేరే ఊరు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పందిని తప్పించబోయి ప్రమాదం: ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు
ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆటోలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. గాయపడిన క్షత్రగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:జంట హత్యల కేసు: వెలుగులోకి కొత్త నిజాలు..