తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎంపీ సంతోష్‌కుమార్‌ పేరిట టోకరాకు యత్నం - ఎంపీ సంతోష్‌కుమార్‌ తాజా వార్తలు

ఎంపీ సంతోష్‌కుమార్‌ పేరిట సైబర్‌ కేటుగాళ్లు ఓ వ్యక్తికి టోకరా వేసేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Attempt to cyber cheat in the name of MP Santosh Kumar in Hyderabad
ఎంపీ సంతోష్‌కుమార్‌ పేరిట టోకరాకు యత్నం

By

Published : Aug 27, 2020, 7:39 AM IST

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పేరిట సైబర్‌ కేటుగాళ్లు ఓ వ్యక్తికి టోకరా వేసేందుకు యత్నించారు. మాదాపూర్‌లో ఉండే ఓ వ్యక్తి(48)కి ఫేస్‌బుక్‌లో ఎంపీ సంతోష్‌కుమార్‌ పేరిట ఉన్న నకిలీ ఖాతా నుంచి ఈ నెల 25న స్నేహ అభ్యర్థన వచ్చింది. అతను అంగీకారం తెలిపారు.

ఆ తర్వాత ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి రూ.50 వేలు పంపించాలని చెప్పాడు. గూగుల్‌ పే చేయమంటూ రెండు ఫోన్‌ నంబర్లను ఇచ్చాడు. అనుమానంతో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details