తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రాత్రివేళ యువకునిపై విచక్షణారహితంగా దాడి - attack on a young men in mulugu district news

రాత్రివేళ ఒంటరిగా ఉన్న వ్యక్తి పై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. భూ వివాదాల కారణంగానే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు.

attack-on-a-young-men-in-mulugu-district-venkatapur-mandal
రాత్రివేళ యువకునిపై విచక్షణారహితంగా దాడి

By

Published : Jan 15, 2021, 5:34 PM IST

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఉప్పేడు వీరాపురం గ్రామానికి చెందిన రామక్రిష్ణ అనే యువకుడిపై కొందరు దాడి చేశారు. నిన్న రాత్రి ఐదుగురు యువకులు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి బాధితుడి ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు.

భూ తగాదాలే కారణం..?

రామక్రిష్ణ నిన్న రాత్రి కూల్ డ్రింక్ తాగుదామని గ్రామంలోని కిరాణా షాప్ వద్దకు వెళ్లాడు. ఐదుగురు యువకులు వెనుక నుంచి తనపై కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు. 4 ఏళ్లుగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయని.. నిన్న పండగ నేపథ్యంలో ముగ్గులు పోటీలు జరుగుతుండగా అక్కడ కూడా గొడవ జరిగిందని అతడు తెలిపాడు.

రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో తనపై కొండమల్ల విజయ్, అతని తమ్ముడు శ్యామ్, ఇంకో మగ్గురు మొత్తం ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని బాధితుడు తెలిపాడు. తన పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్​లను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: బండరాయితో తలపై మోది యువకుని హత్య

ABOUT THE AUTHOR

...view details