తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బ్యాంక్​కు వచ్చిన నిరక్షరాస్యులే లక్ష్యంగా డబ్బులు చోరీ!

అమాయకులు, నిరక్షరాస్యులే లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డు మార్చి మోసం చేసి డబ్బులు డ్రా చేసుకుని తమ ఖాతాల్లోకి వేసుకుంటున్న మోసగాడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని ఖాతా నుంచి రూ. 7.12 లక్షలు, ఓ మోటార్​ సైకిల్​ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్​రెడ్డి వెల్లడించారు.

atm fraudster working as security guard arrest at sangareddy
బ్యాంక్​కు వచ్చిన నిరక్షరాస్యులే లక్ష్యంగా డబ్బులు చోరీ!

By

Published : Sep 29, 2020, 4:09 PM IST

సంగారెడ్డి జిల్లో ఏటీఎం కేంద్రానికి వచ్చే నిరక్షరాస్యులు, అమాయక ప్రజల ఏటీఎం కార్డులో నుంచి డబ్బులు డ్రా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచినట్లు సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్​రెడ్డి వెల్లడించారు. స్థానిక బ్రాహ్మణవాడలో నివాసముంటున్న మహాత్మారావు కరూర్​ వైశ్యా బ్యాంకులోని ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఏటీఎం కేంద్రానికి వచ్చే నిరక్షరాస్యులకు సహాయం చేస్తూ వారి ఏటీఎం కార్డులను మార్చి ఇచ్చేవాడు. వారి కార్డుల ద్వారా వివిధ ఏటీఎంలలో అనేక దఫాలుగా డ్రా చేసుకుని తన ఖాతాల్లో వేసుకునేవాడు. గత రెండేళ్లుగా ఇదే పని చేస్తూ యథావిధిగా బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనిపై ఇదివరకే నాలుగు కేసులు నమోదు కాగా.. తప్పించుకుని తిరుగుతున్నాడు. జోగిపేట ఎస్సై వెంకటరాజ.. అతన్ని పట్టుకుని.. రూ. 7.12 లక్షల నగదు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: మిస్సింగ్​ మిస్టరీ: అమ్మా... నాన్న... తప్పిపోయిన కొడుకు

ABOUT THE AUTHOR

...view details