తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అక్రమంగా గోవుల తరలింపు.. నిందితుల అరెస్ట్​ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్​ ప్లాజా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తోన్న రెండు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Arrest of accused of moving cows illegally
అక్రమంగా గోవుల తరలింపు.. నిందితుల అరెస్ట్​

By

Published : Sep 18, 2020, 7:11 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద గోవులను అక్రమంగా కబేలాకు తరలిస్తోన్న రెండు డీసీఎం వాహనాలను విశ్వహిందూ పరిషత్, భజరంగ్​దల్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాహనాలతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గోవులను వరంగల్ నుంచి హైదరాబాద్​కు అక్రమంగా తరలిస్తున్నట్లు బీబీనగర్ ఎస్సై రాఘవేందర్ తెలిపారు. గోవులను రాజపేటలోని చెన్నూరు గోశాలకు తరలించినట్లు వివరించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇదీచూడండి.. ప్రశాంతంగా పాలిసెట్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ABOUT THE AUTHOR

...view details