తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సీసీఎస్ పోలీసులకు అపోలో యాజమాన్యం ఫిర్యాదు - crime neqws

కరోనాపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరోనా మామూలు వ్యాధి కాదు అతి భయంకరమైనది...కావాలంటే డాక్టర్, రిపోర్టర్ కు మధ్య ఈ సంభాషణ వినండి అంటూ వాట్సాప్​లో ఓ ఆడియో చక్కర్లు కొడుతోంది. ఈ సంభాషణ ఆడియోపై అపోలో యాజమాన్యం హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Apollo
సీసీఎస్ పోలీసులకు అపోలో యాజమాన్యం ఫిర్యాదు

By

Published : Mar 28, 2020, 3:38 PM IST

కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ... కరోనాపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కరోనా మామూలు వ్యాధి కాదు అతి భయంకరమైనది...కావాలంటే డాక్టర్, రిపోర్టర్ కు మధ్య ఈ సంభాషణ వినండి...మిగిలిన వారికీ పంపండి.. అంటూ ఓ ఆడియో ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ సంభాషణ ఆడియోపై అపోలో యాజమాన్యం హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమ హాస్పిటల్స్​కు, డాక్టర్లకు, ఈ ఫోన్ సంభాషణకు ఎలాంటి సంబంధం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

అలాగే మరో కేసులో, మాజీ ఐపీఎస్ అధికారి జెేడీ లక్ష్మీ నారాయణ వాయిస్ తో సోషల్ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఐపీ అడ్రస్​ల ఆధారంగా వైరల్ చేస్తున్న వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:కూలీల కన్నీటి యాత్రలు.. 100ల కి.మీ నడుస్తూ, రిక్షా తొక్కుతూ...

ABOUT THE AUTHOR

...view details