నిజామాబాద్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని మహిళను దుండగులు గొంతు నులిమి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత మహిళను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాన్ని కాల్చేశారు. వర్ని మండలం బడాపహాడ్ బస్టాండ్ వెనుక భాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహిళను హత్య చేసి ముఖాన్ని కాల్చేశారు.. - nizamabad women death news
గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గొంతు నులిమి హత్య చేసిన దుండగులు.. గుర్తుపట్టకుండా ఉండడానికి ముఖాన్ని కాల్చేశారు.
హత్య చేసి ముఖాన్ని కాల్చేశారు..
అటు వైపుగా వెళ్లిన కొందరికి మహిళ మృతదేహం కనిపించగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన మహిళల వివరాలు ఇంకా తెలియరాలేదు. తెలిసిన వాళ్లే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జాగిలాలతో నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:జియో యూజర్లకు గుడ్న్యూస్- ఇక అన్ని కాల్స్ ఫ్రీ!