తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆడ శిశువును ఆసుపత్రిలో వదిలేసిపోయిన వృద్ధురాలు - మహబూబ్​నగర్​లో శిశువును వదిలి వెళ్లిన వృద్ధురాలు

మా పాపకు ఒంట్లో బాగోలేదని... ఓ వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చింది. పాపను బెంచీపై పడుకోబెట్టి... కింద రిపోర్ట్స్ ఉన్నాయని వెళ్లింది. ఇగ ఆమె ఎంతకూ తిరిగి రాలేదు. ఆ శిశువును వదిలించుకుని వెళ్లిపోయింది.

An old woman who left a baby girl in the hospital in Mahabubabad District
ఆడ శిశువును ఆసుపత్రిలో వదిలేసిపోయిన వృద్ధురాలు

By

Published : Nov 20, 2020, 7:48 PM IST

నవమాసాలు మోసి.. పుట్టిన ఆడ శిశువు పేగు తడి ఆరకముందే వదిలించుకుంది ఓ కర్కశ తల్లి. ఆ ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలివెళ్లారు. ఆసుపత్రికి వచ్చిన ఓ వృద్ధురాలు.. తమ పాపకు ఒంట్లో బాగోలేదని చెప్పి.. శిశు వార్డుకు తీసుకుని వచ్చింది. బెంచీపై పడుకోబెట్టి.. పాపకు సంబంధించిన మెడికల్​ రిపోర్ట్స్​ కింద వార్డులో ఉన్నాయని... చెప్పి వెళ్లిపోయింది.

ఆడ శిశువును ఆసుపత్రిలో వదిలేసిపోయిన వృద్ధురాలు

ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో వైద్యులు ఐసీడీఎస్​ సిబ్బందికి సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బంది పాపను వారికి అప్పగించారు. పాప ఆరోగ్యం కుదుట పడే వరకు ఈ ఆసుపత్రిలోనే చికిత్స జరిపిస్తామని... ఐసీడీఎస్​ సూపర్ వైజర్​ ఉషా తెలిపారు. అనంతరం హన్మకొండలోని శిశువిహార్​కు తరలిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details