నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వృద్ధురాలి దేహంపై పందులు దాడి చేసి పీక్కు తిన్నాయి. భిక్షాటన చేస్తూ పొట్ట పోషించుకుంటున్న ఓ అనాథ వృద్ధురాలు.. బస్టాండ్ ఆవరణలోనే సేద తీరేది. రాత్రిళ్లు అక్కడే నిద్రించేది. శనివారం రాత్రి చలికి తట్టుకోలేక పోయిన ఆమె.. మృతి చెందింది. ఆ రాత్రి మృతదేహంపై పందులు దాడి చేసి శరీర భాగాలను తిన్నాయి.
తెల్లవారు జామున వృద్ధురాలి మృతదేహం వద్ద పందులు ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.