తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యం చోరీ చేస్తూ పోలీసులకు చిక్కారు - police arrested 8persons

లాక్​డౌన్ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గంలోని మద్యం దుకాణాల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గౌరారం మండలంలోని ఓ వైన్స్​లో మద్యం చోరీ చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.

Allegedly the police caught up with him
మద్యం చోరీ చేస్తూ పోలీసులకు చిక్కారు

By

Published : Apr 29, 2020, 11:55 AM IST

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలోని మల్లికార్జున వైన్స్​లో మంగళవారం రాత్రి కొందరు దొంగతనానికి వెళ్లారు. పోలీసులు.. మద్యం చోరీచేస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.5 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు.

పట్టుబడిన 8 మంది నిందితుల్లో ఇద్దరు ఆ మద్యం దుకాణం యజమానులు ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరందరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. వైన్స్​ వెనక వైపున గల కిటికీలను పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు వివరించారు.

ఇదీ చూడండి: నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details